---Advertisement---

మైలారం మల్లన్న జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు 

---Advertisement---

మైలారం మల్లన్న జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు

 

.అట్టహాసంగా బండి షిడ

 

• కర్ణాటక, మహారాష్ట్రా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు

 

తెలంగాణ కెరటం:నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి 15 డిసెంబర్

 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధి లోని అనంతసాగర్ (మైలారం) గ్రామంలో ఆదివా రం బండి షిడి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వ హించారు. దైవభక్తి ముందు సాహస బాల దూరా న్ని అనంతసాగర్ గ్రామస్తులు నిర్వహించారు. మల్ల న్న జాతర ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన బండి షిడి ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. పొడవ టి కర్రతో మనిషిని వేలాడదీసి బండికి కట్టి దేవాల యం చుట్టూ ఐదు ప్రదర్శనలు చేశారు. గ్రామానికి చెందిన ఒగ్గు కుటుంబం వారు మాత్రమే బండి షిడి ప్రదర్శన పాల్గొంటారు. ఈ జాతర పురస్కరించుకొ ని కల్యాణం, శివ సత్తుల ప్రదర్శన, వీధి నాటకాలు, గుండం స్నానం, పోతరాజుల నాట్యంలో ఊరేగిం పు, బోనాలు, బండ్ల ఊరేగింపు కూడా నిర్వహించారు. అనంతసాగర్ మాదిరిగనే కర్ణాటకలోని మైలారంలోని ఇలాంటి ప్రదర్శన ఇదే రోజు నిర్వ హిస్తారని గ్రామానికి చెందిన పూజారి తె లిపారు. తమ గ్రామంలో మల్లన్న స్వామి దేవాలయం 156 ఏళ్లకు పూర్వం నుంచి ఉందన్నారు. కాగా షిడి ప్రదర్శనలో పా ల్గొన్న ఒగ్గు అశోక్ అనే వ్యక్తిని, ఒక మే కను గ్రామస్తులంతా వారి ఇంటి నుంచి ఊరేగింపు గా తీసుకు వస్తారు. అనంతసాగర్, సంజీవనరావు పేట, నగ్గర్, సిర్గాపూర్ గ్రామాల్లోని మల్లన్న జాతర లో పాల్గొని మల్లన్న ప్రత్యేక పూజలు నిర్వహించా రు. బండీ షిడీ జాతరలో నియోజకవర్గంలో పాటుకర్ణాటక మహారాష్ట్రల నుంచి భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ మల్లన్న జాతర ప్రారంభం నుంచి జాతరులు కొనసాగుతా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోల సుధాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంజీవనరావుపేట మల్లన్న జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పీసీసీ సభ్యులు కే.శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment