విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.
మండల విద్యాధికారి సత్యనారాయణరెడ్డి.
తెలంగాణ కెరటం : రాయపోల్ ప్రతినిధి : డిసెంబర్ 11
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి మంచి విద్యాబోధన చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయ సిబ్బందిపై ఎంతో ఉందని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన భోజన వంటకాలను. కూరగాయలను పరిశీలించారు. రోజురోజువారిగా కూరగాయలు తీసుకురావాలని. విద్యార్థులకు పౌష్టికారంతో మంచి ఆహారం అందించాలని. ఇలాంటి నిర్లక్ష్యం చేసిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయడం వలన విద్యార్థులకు పది పరీక్షల్లో మంచి మార్కులు సాధించి జిల్లాలోని రాయపోల్ మండలాన్ని ప్రథమ స్థానంలో నిలుపాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్స్ జరుగుతుందని విద్యార్థులు కూడా చదువుపై దృష్టి పెట్టి వందకు వంద మార్కులు తెచ్చుకుంటే గ్రామాలకు పాఠశాలకు తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుందన్నారు. పదవ తరగతి పరీక్షలు విద్యార్థి దశ ఎంతో కీలకమని పది విద్యార్థి సెల్ ఫోన్ కు దూరంగా ఉండి. ఉదయం సాయంత్రం ఏకాగ్రతగా ఉండి చదువుపై దృష్టి పెడితే పది పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారని గుర్తు చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ దివ్య. మండల ఎంపీ ఓ శ్రీనివాస్.కార్యదర్శి శివకుమార్. తదితరులు పాల్గొన్నారు.