జాతీయ స్థాయి శిక్షణకీ ఎంపిక అయిన రాదారి నాగరాజు
తెలంగాణ కెరటం దుబ్బాక:జనవరి
తెలంగాణా ఆదర్శ పాఠశాల లచ్చపేట పోస్ట్ గ్రాడ్యుయేట్ (పొలిటికల్ సైన్స్)టీచర్ గా పనిచేస్తున్న రాదారి నాగరాజు ఈ నెల 8 నుండి 28 తేది వరకు ఢిల్లీ సిసిఈఆర్టి లో జరుగుతున్న జాతీయ విద్యా విధానం 2020 పై శిక్షణకు హాజరు అవుతున్నట్లు ఎస్సిఈఆర్టి డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసారు. తెలంగాణా రాష్టం నుండి 10 మంది ప్రతినిధులు హాజరు అవుతున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ శిక్షణ లో న్ఈపి 2020 లో భాగంగా నూతన విద్యావిధానంలో వస్తున్న మార్పుల గూర్చి శిక్షణ ఉంటుందని తెలిపారు. ప్రిన్సిపాల్ బుచ్చిబాబు,ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేసారు.ఈ సందర్బంగా ఢిల్లీ లోని పాఠశాలల పనితీరు అంశాలపై కూడ శిక్షణ వుంటుందని తెలిపారు.