రామాయంపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా మహా పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహణ. 

రామాయంపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా మహా పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహణ. 

41 రోజులపాటు దీక్ష చేస్తున్న కార్డియాల గ్రామం బి ఆర్ ఎస్ నాయకుడు రాజేందర్ గుప్తా ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ నిర్వహణ.

అయ్యప్ప దేవాలయ కమిటీ వ్యవస్థాపకుడు పల్లె జితేందర్ గౌడ్ చేతుల మీదుగా అయ్యప్ప మహా స్వామి పడిపూజ నిర్వాహన. 

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 17:

మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 41 రోజుల పాటు దీక్ష తీసుకున్న కాట్రియాల గ్రామ బీఆర్ఎస్ నాయకులు రాజేందర్ గుప్తా ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు.స్థానిక మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప దేవాలయ కమిటీ వ్యవస్థాపకులు పల్లె జితేందర్ గౌడ్ చేతుల మీదుగా ఈ అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజ కార్యక్రమం నిర్వహించారు, భక్తి గీతాలు,భజన కీర్తనలతో అయ్యప్ప దేవాలయం మారుమోగింది.అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, బి ఆర్ ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంటారెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొని స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో వారు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు.పెద్ద ఎత్తున భక్తులు, అయ్యప్ప స్వాములు, కన్య స్వాములు, రాజకీయ నాయకులు,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment