అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డు అందజేయాలి
– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి
ఇప్పుడు గ్రామాలలో, పట్టణాల్లో జరుగుతున్న రేషన్ కార్డు పరిశీలనలో ఎవరి పేరైనా, లేనట్లయితే వారు ఎటువంటి అనుమానం అవసరం లేదని, రేషన్ కార్డు లేనివారు తేది 21 నుండి 24 వరకు జరుగబోయే గ్రామ, వార్డు సభల్లో ఆధార్ కార్డు జీరాక్స్, ఫోటోలు ఇతర వివరములతో అందజేయవచ్చని, అంతేగాక మండల పరిషత్ (ఎంపీడీఓ) కార్యాలయంలో ప్రజాసేవ కేంద్రాలలో కూడా అందజేయవచ్ఛని తెలిపారు. రేషన్ కార్డులో వారి వారి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలని పెట్టుకున్న దరఖాస్తులను , పెట్టుకోబోయే దరఖాస్తులను కూడా విచారించి తగుచర్య తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డులు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందజేయడం అనేది నిరంతర ప్రక్రియ అని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా గ్రామాల్లో, వార్డుల్లో జరుగుతున్న సర్వేలో పేరు నమోదు లేని వారు కూడా ఈ నెల 21 నుండి 24 వరకు మీ మీ గ్రామాలు, వార్డుల్లో జరుగబోయే గ్రామ, వార్డు అందజేయవచ్చనీ, అంతేగాక ప్రజా పాలన సేవా కేంద్రాల్లో తమ దరఖాస్తులు ఇవ్వవచ్చని తెలిపారు.