రియల్ ఎస్టేట్ఏ జెంట్లకు అనేక సమస్యలు ఉన్నాయి

  • రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు నారగోని ప్రవీణ్ , పగడాల రంగారావు
  • రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కాటేపల్లి జనార్ధన్ నియామకం

ఖమ్మం, జనవరి03 (తెలంగాణ కెరటం): రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కాటేపల్లి జనార్ధన్ ని ను ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ , ప్రధాన కార్యదర్శి పగడాల రంగారావు నియమించారు . శుక్రవారం బల్లేపల్లిలోని పుష్ప ఫ్యామిలీ రెస్టారెంట్లో ఖమ్మం జిల్లా రియల్ ఎస్టేట్ యూనియన్ ఆధ్వర్యంలో కాటేపల్లి జనార్ధన్ ను సన్మానించారు . ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు నారగోని ప్రవీణ్ , పగడాల రంగారావు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్లకు అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు . సంఘ సభ్యులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు . సంఘంలో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా , నగర, మండల , గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరికీ తమ వంతు సహాయం చేస్తామని చెప్పారు. ముందుగా తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కాటేపల్లి జనార్ధన్ ను సన్మానించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు . ఈ సందర్భంగా కాటేపల్లి జనార్దన్ మాట్లాడుతూ సంఘానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నా రు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్రఉపాధ్యక్షులు పెద్దిరాజు, కార్యదర్శులు కోట వెంకటరెడ్డి,అన్నం వీర ప్రసాద్, జిల్లా నాయకులు బుర్ర సురేష్ బాబు,ఎస్కే అన్వర్ పాషా, కే కైలాష్, పఠాన్ జానీ, జల్ది శ్యాము, పామర్తి నాగేశ్వరరావు, మదర్, ప్రసాద్ రెడ్డి, కన్నారావు, దేవుళ్ళ వెంకట్, పాశం నరేష్, నున్న కృష్ణప్రియ, వెంకటకృష్ణ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment