తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 28 : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వికలాంగుల క్రీడా పోటీలలో జగిత్యాల జిల్లాకు చెందిన వికలాంగులు రాష్ట్ర స్థాయి బహుమతులు గెలుచుకున్నారు. విజేతలు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.శైలజ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన బి.రజిని క్యారం పోటీలో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి, వెల్గటూర్ గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ రన్నింగ్, షాట్ పుట్ లో ద్వితీయ బహుమతి పొందారు. వీరిని జగిత్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి, జిల్లా కలెక్టర్ అభినందించారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారిలో చిర్నేని శ్రీనివాస్, అజ్గర్ ఖాన్, అట్లా రాము, రాజేందర్, సునీత, సాయి, ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య, చంద్రమోహన్ పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి వికలాంగుల క్రీడా పోటీలలో ప్రతిభ చూపిన జిల్లా వాసులు
Updated On: November 29, 2024 6:05 pm
---Advertisement---
I’m truly enjoying the design and layout of your website.
It’s a very easy on the eyes which makes it much
more pleasant for me to come here and visit more often. Did you hire out a
designer to create your theme? Superb work!