గ్రూప్ -02 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రెవెన్యూ డివిజనల్ అధికారి రమాదేవి.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 13:
మెదక్ పట్టణంలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించే పరీక్షా కేంద్రాలను ఆర్డిఓ రమాదేవి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్ష సమయం దగ్గర పడుతున్నందున మెదక్ లో 11 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేయడంలో భాగంగా పరిశీలించడం జరిగిందన్నారు. గ్రూప్ -02 పరీక్షా కేంద్రాలైన 1 గీతా హైస్కూల్ మోంబోజిపల్లి 2 ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు ఎమ్డికె 3 గీతా జెఆర్ కళాశాల ఎండికె 4 సిద్ధార్థ్ జూనియర్ని తనిఖీ చేశామన్నారు.ఆర్డిఓ వెంట తాసిల్దార్ లక్ష్మణ్ బాబు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.