రోడ్డు భద్రత నియమాలు పాటించాలి ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్ ధరించాలి .
ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనా పాటించాలని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం సూచించారు. సోమవారం సూర్యాపేటలో శంకర్ విలాస్ సెంటర్లో ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా హెల్మెట్ ధరించడంతో కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించారు. వాహన చోదుకులు నిబంధనలు పాటించకపోతే నిబంధనల ప్రకారం జరిమానాలు తప్పవని హెచ్చరించారు.తలలో ఉన్న సున్నితమైన అవయవం మెదడు ఈ మెదడు దెబ్బ తినకుండా ఉంటే మిగిలిన శరీర భాగాలు గాయాలైన కోలుకునేందుకు వీలుగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు .