రూ.1.38 లక్షల బెల్లం పట్టివేత.
630 కేజీల బెల్లం, 50 కేజీల అలం స్వాధీనం.
కారు, ఒక వ్యక్తి అరెస్టు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి
నాటుసారా తయారీ కోసం హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పనూతల మండలం దేవదారికుంట గ్రామానికి కారులో బెల్లం తరలివెలుతుందానే పక్క సమాచారం మేరకు అచ్చంపేట ఎక్సైజ్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సూర కృష్ణ బృందం కలిసి అచ్చంపేట్ మండల పరిధిలో గల హజీపూర్ ప్రాంతంలో మంగళవారం మాటు వేసి కారును పట్టుకున్నారు.కారును తనిఖీలు నిర్వహించగా 21 బ్యాగుల బెల్లం సంచులు కనిపించాయి. ఒక్కొక్క బెల్లం బ్యాగులో 30 కేజీల బెల్లం ఉంటుంది. మొత్తంగా 680 కేజీల బెల్లం, బెల్లంతోపాటు 50 కేజీల అలం, 10 లీటర్ల నాటుసారా లభించింది.
శివ అనే వ్యక్తి తన మారుతి 800 అనే కారులో బెల్లం, అలంను తీసుక వెలుతున్నట్లు అంగీకరించాడు. పట్టుకున్న బెల్లం, అలం, కారుతో కలిపి రూ. 1.38 విలువ ఉంటుందాని అంచనావేశారు.
బెల్లం కారును పట్టుకున్న టీమ్‌లో ఎస్‌హెచ్‌ఓతో పాటు ఎస్సై సతీష్, కానిస్టేబుళ్లు అంజనేయులు, బాలయ్య, నవీన్, బందీలాల్‌లు ఉన్నారు.
బెల్లం కారును పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్
వి.బి.కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరిండెంట్ డి.గాయత్రీ అభినందించారు.