శ్రీ కొండపోచమ్మ దేవాలయంలో సదురు పటం
-కొండపోచమ్మ జాతరకు సర్వం సిద్ధం
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి
జగదేవపూర్ మండలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసిన శ్రీ కొండ పోచమ్మ ఆలయం జాతరకు ముస్తాబైంది.మండలంలోని తీగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలో ఉన్న ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది.కొండ పోచమ్మను స్వయాన కొమురవెల్లి మల్లికార్జునస్వామికి చెల్లెలుగా చెబుతుంటారు.కొండపోచమ్మ ఉత్సవాలను సంక్రాంతి,భోగి పండుగ రోజున సదరు పటంతో అంకురార్పణ చేస్తారు.సంక్రాంతి రోజున ప్రారంభమై వచ్చే ఉగాది పండుగతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి.ఈ నెల 20 నుంచి జాతర ప్రారంభమవుతుంది. జాతరకు జంట నగరాలు హైదరాబాద్,సికింద్రాబాద్‌తో పాటు వరంగల్,కరీంనగర్,అదిలాబాద్,యాదాద్రి భువనగిరి,జనగామ తదితర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.భక్తుల రద్దీ దృష్ట్యా పారిశుధ్య పనుల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్టు గ్రామ మాజీ సర్పంచ్ రజితా రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తిగుల్ గ్రామ మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.