నేటి యువత సేఫ్ జర్నీ – దేశానికి శ్రీరామరక్ష.

నేటి యువత సేఫ్ జర్నీ – దేశానికి శ్రీరామరక్ష.

 

వేగం కన్నా – ప్రాణం మిన్న.

 

రోడ్డు భద్రత- ఫ్రెండ్లీ పోలీస్ కు సహకరిద్దాం.

 

నేటి సమాజ నిర్మాణం-

యువత శక్తి యుక్తి కీలకం.

 

తల్లిదండ్రుల కలలను సహకారం చేద్దాం.

 

విజయవంతమైన బైక్ సేఫ్ రైడింగ్ క్రీడలు.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జనవరి 15):

 

నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం సంక్రాంతి సందర్భంగా గ్రామంలోని యువకులను ఉత్తేజపరిచేందుకు గ్రామ పెద్దల సమక్షంలో నేటి యువత సురక్షితంగా గమ్యానికి చేరే ప్రయాణమే యువకులకు బైక్ సేఫ్ జర్నీ రైడింగ్ క్రీడలు స్థానిక హనుమాన్ దేవాలయ సమీపంలో నిర్వాహకులు డాక్టర్ మావిళ్ళ శేఖర్ మరియు వెంకటేష్ గౌడ్ శివాజీ శశిపాల్ పాలు కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి శ్రీరామరక్ష అని క్రీడ నిర్వాహకులు డాక్టర్ అన్నారు.రైడింగ్, వేగం కన్నా ప్రాణం మిన్న, అని నేటి సమాజ నిర్మాణం యువత శక్తి యుక్తులపై ఆధారపడి ఉంటుందని, అందుకు యువకులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు సురక్షితంగా తమ గమ్యానికి చేరి దిశగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, లైసెన్స్, మరియు వాహన ఆర్సి కలిగి,”రోడ్డు భద్రత – ఫ్రెండ్లీ పోలీస్” కుసహకరించాలన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వరాదన్నారు.ప్రత్యేకంగా యువకులు మద్యపానం, ఆల్కహాల్ , డ్రగ్స్, సిగరెట్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. తెలిసి తెలియక చేసిన తప్పుకి చట్టపరంగా జీవితాంతం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కావున చట్టాన్ని గౌరవించి సమాజంలో సత్ప్రవర్తన తో మెలగాలని, మన కన్న తల్లిదండ్రుల కలలను సహకారం చేసే దిశగా యువత లక్ష్యాలు, సాధించే క్రమంలో అనునిత్యం తగిన జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబ సమేతంగా ఆనందంగా సంతోషంగా జీవిస్తూ సమాజంలో అందరికీ స్ఫూర్తిగా నిలవాలన్నారు. ఈ యొక్క బైక్ సురక్షిత ప్రయాణం క్రీడలను 100 మీటర్ల వరకు నిర్వహించటం జరిగింది. ఈ క్రీడల్లో సుమారు 50 మంది యువకులు పాల్గొన్నారు. క్రీడల్లో ప్రథమ బహుమతి కెంచ శేఖర్, ద్వితీయ బహుమతి మాడుగుల అరవింద్, తృతీయ బహుమతి మాధవుని శేఖర్, చతుర్ బహుమతి మావిళ్ళపల్లి సురేష్ గెలుపొందారు. క్రీడల్లో గెలుపు సాధించిన యువకులకు గ్రామ పెద్దలు మధు నాగుల సుల్తాన్, ద్యాసని రాజశేఖర్ రెడ్డి, గుండ్రాతి తిరుపతయ్య గౌడ్, నాగిళ్ల రామచంద్రుడు లు నగదు బహుమతులు అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment