తెలంగాణ రాష్ట్రం లో మళ్లీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల అమ్మకాలు
తెలంగాణ నిరుద్యోగ రక్షణ
జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ మైపాల్ యాదవ్ కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు
తెలంగాణ కరటం కామారెడ్డి ప్రతినిధి డిసెంబర్ 28
కామారెడ్డి జిల్లా బ్యాక్ లాగ్ లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ చైర్మన్ మైహిపాల్ యాదవ్ కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డిలో మళ్లీ దొడ్డి దారిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తకి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు. రెండు నెలల కిందట సోమాజిగూడ ప్రెస్ క్లబ్బు వేదికగా ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకువెళ్లిన అంతేకాకుండా నవంబర్ 29 న నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేయడం జరిగిందని అంతేకాకుండా డిసెంబర్ 20 తేదీన బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో చెప్పడంతో అప్పుడు వెంటనే నవమాత్రంగా ఆపివేసి అందరూ మర్చిపోయారని మళ్లీ తొందరలో నిరుద్యోగులకు నేమ్ చేయడానికి బ్యాగ్ లాక్ ఉద్యోగులలో మున్సిపల్, ఇరిగేషన్ ,రెవిన్యూ ,తో పాటు అనేక రకాల డిపార్ట్మెంట్లో అక్రమల భర్తీకి సలహాలు జరుగుతున్నాయని సమాచారం వుందన్నారు. కామారెడ్డి లో బ్యాక్ లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు.ఎవరైనా ఉద్యోగాలను డబ్బులతో కొనుకుంటే వారి పూర్తి సమాచారం రాష్ట్ర కమిషనర్ కు, సీఎస్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.అందుకే నిరుద్యోగులకు రక్షణగా తెలంగాణ నిరుద్యోగ రక్షణ జెఏసి ఏర్పడిందని చైర్మన్ మహిపాల్ యాదవ్ అన్నారు.ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే రాష్ట్రా వ్యాప్తంగా బస్ యాత్ర చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డప్పు సురేష్,బి ఎల్ ఫ్ రాష్ట్ర నాయకులు వడ్ల సాయికృష్ణ, జిల్లా నాయకులు ప్రసాద్, పాల్గోన్నారు.