చదువుల తల్లికి వందనం

  • సావిత్రిబాయి పూలే గొప్ప దార్శనికురాలు, ఘనంగా జయంతి


ఖమ్మం జిల్లా బ్యూరో, డిసెంబర్ 3 (తెలంగాణ కెరటం): సావిత్రిబాయి పూలే చదువుల తల్లి గా , కీర్తి ప్రతిష్టలు ఆర్జించి ,మహిళా అభ్యుదయానికి , ఆర్ధిక స్వవలంబనకు వారి సాధికారతకు చదువు ఆవశ్యకతను గుర్తించి , అందుకు జీవితాంతం పాటుపడిన దార్శనికురాలు సావిత్రిబాయి పూలే అని పలువురు వక్తలు కొనియాడారు. శుక్రవారం స్థానిక వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా కార్యాలయం ఆవరణలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా హాజరై ప్రసంగించారు. సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి , పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. ఫాతిమా షేక్ , రమాబాయి , చాకలి ఐలమ్మ వంటి వీరవనితలు కూడా పూలమాలలు వేసి , నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత ఆర్జెసి కృష్ణ , ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్. స్వర్ణకుమారి , మాజీ డిఎం అండ్ హెచ్ఓ బి. వెంకటేశ్వర్లు , రిటైర్ లెక్చరర్ కృష్ణయ్య , ఐ కె పి సిసి అనురాధ , గౌరవ సలహాదారులు బిపి. నాయక్ లు మాట్లాడారు. మహిళలు బయటకు రాని ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో తన భర్త పూలే తో కలిసి స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి పూలే దార్శనికత తోనే నేడు పలువురు మహిళలు అనేక రంగాలలో విస్తరించుకొని , మరిన్ని రంగాలలో దూసుకు వెళ్తున్నారని ప్రశంసించారు. చిన్న వయసులోనే వివాహం చేసుకున్నప్పటికీ చదువు ఆవశ్యకతను గుర్తించి , అను చదువుకోవటమే కాకుండా మహిళలు కూడా చదువు అవసరాన్ని గుర్తించి , అందుకు నిరంతరం పాటుపడుతూ పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. పలు మహిళా సంఘాలు , మహిళలు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని మహిళల అభ్యున్నతికి , అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. వీరనారీమణుల ఆశయ సాధన సమితి వీర నారీమణుల ఆశయ సాధనకు కృషి చేయడం పట్ల అభినందనలు ప్రకటించారు. రిటైర్డ్ లెక్చరర్ రమేష్ బాబు ,సమితి గౌరవ సలహాదారులు బానోతు తారా దేవి , రిటైర్డ్ హెడ్మాస్టర్ పెద్దపాక నాగభూషణం , మరో గౌరవ సలహాదారుడు తెల్లకుల శ్రీనివాస్ లు ప్రసంగించగా వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి , సమితి నాయకులు, కార్యకర్తలు జ్యోతి, స్పందన , ప్రమీల, కవిత, భవాని, త్రివేణి, ఝాన్సీ, విజయ, వినీల ,శ్రీదేవి, నాగేంద్ర, కల్పన, సుభద్ర, జాన్ బీ , సృజన, లక్ష్మీ లతో పాటు ప్రత్యేక అతిధులుగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ప్రజాసంకల్ ఐక్యవేదిక నాయకులు బానోతు బద్రు నాయక్ , పగిళ్లపల్లి నాగేశ్వరరావు ,భూక్య రమేష్ , ఉప్పెర శ్రీను , లాయర్ వీరన్న, రవీందర్ నాయక్ , సంజీవరావు, రవి , వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment