---Advertisement---

పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల, నిర్వహణ పై అవగాహన కలిగి ఉండాలి.

---Advertisement---

పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల, నిర్వహణ పై అవగాహన కలిగి ఉండాలి.

 

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 10)

 

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరములో పారిశుద్ధ్యం వ్యక్తిగతం మరుగుదొడ్ల నిర్వహణలో, ఎంపికైన వారిని సన్మానించారు .ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకొని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ- స్వచ్చ భారత్ మిషణ్ (గ్రామీణ ) ద్వారా నవంబర్ 19 నుండి డిసెంబర్ 10 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజల సహకారంతో క్షేత్రస్థాయి లో ,మండల అధికారుల ద్వారా ప్రజల్లో పారిశుధ్యం పైన అవగాహన కల్పించడం, వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశుభ్రంగాఅలంకరించుకున్న వారిని గ్రామ, మండల స్థాయిలో గుర్తించి వారిని సన్మానించారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ , మాట్లాడుతూ ప్రభుత్వాలు త్రాగునీరు మరియు పారిశుధ్యం మానవ హక్కులుగా గుర్తించడం జరిగిందని, ఇందుకుగాను ప్రభుత్వాలు, ప్రజలందరికీ సౌకర్యంగా ఉండేలా పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, ఈ సౌకర్యాలు గృహాలతో పాటుగా అన్ని ప్రజా స్థలాలు, పాఠశాలలు, అంగన్వాడీల్లో కచ్చితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. త్రాగు నీరు మరియు మరుగుదొడ్లు అవసరమైన చోట గుర్తించి వెంటనే అందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల వారోత్సవాలను క్షేత్రస్థాయిలో నిర్వహించిన అధికారులను ఇందుకు సహకరించిన ప్రజలను అభినందించారు.ప్రజల్లో పారిశుధ్యం పై అవగాహనా కల్పన- “ముఖ్యంగా వ్యక్తిగత మరుగుదొడ్లను, ప్రజా స్థలాలో మరుగుదొడ్లను పరిశుబ్రంగా ఉంచడం”, మరుగుదొడ్డి అనేది కేవలం ఒక అవసరమే కాకుండా అది మన జీవితాల్లో ఒక భాగమని మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటాము మన వ్యక్తిగత మరుగుదొడ్డిలను కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనకు వ్యక్తిగత పరిశుభ్రత అలవర్చుకోవడమే కాకుండా ఎలాంటి వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయని, మరుగుదొడ్డి వాడిన ప్రతిసారి సబ్బుతో చేతి చేతులు కడుక్కోవడం మరియు మరుగుదొడ్డిని పరిశుభ్రంగా చేసుకోవడం ద్వారా, ఎలాంటి అనారోగ్యాలకు, వ్యాధులు గురికాకుండా ఉండడం జరుగుతుందని తెలిపారు. ఈ సందేశాన్ని క్షేత్రస్థాయి అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంఘాల సభ్యులు గ్రామాల్లో మరియు పాటశాలల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు.ప్రతి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్డిని శుభ్రంగా ఉంచుకొని అలంకరించుకున్న వారికి గ్రామస్థాయిలో, మండల స్థాయిలో సన్మానం చేయడం జరిగిందని అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సమక్షంలో, అదనపు కలెక్టర్, దేవ సహాయం, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, , చిన్న ఓబులేసు , , ఎంవీ రామ్మోహనరావు , పారిశుధ్య కార్మికులకు మరియు వ్యక్తిగత మరుగుదొడ్డిఅలంకరించుకున్న వారికి సన్మానం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment