జూనియర్ కళాశాలలకు 11 నుంచి సంక్రాంతి సెలవులు
దుబ్బాక:జనవరి తెలంగాణ కెరటం
ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఈనెల 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె రవీందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలకు 11వ తేదీ శనివారం నుంచి 16వ తేదీ బుధవారం వరకు సెలవులు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్ కమిషనర్ కృష్ణ ఆదిత్య మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. 17వ తేదీ గురువారం నుంచి కళాశాలలో యధావిధిగా ప్రారంభమవుతాయన్నారు. సెలవు రోజుల్లో సిద్దిపేట జిల్లాలో కూడా ప్రైవేటు కళాశాలల్లో స్పెషల్ క్లాసుల పేరిట ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని డీఐఈఓ రవీందర్ రెడ్డి సూచించారు.