లచ్చపేటలో సంక్రాంతి సంబరాలు
దుబ్బాక:జనవరి16,(తెలంగాణ కెరటం)
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట వార్డులో మాజీ కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గురువారం గ్రామంలోని పిల్లలకు గాలిపటాలు ఎగరవేయడంలో పోటీ నిర్వహించారు. మైనార్టీ నాయకుడు రఫీ ఆధ్వర్యంలో హిందూ పండుగ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం పట్ల పలువురు ఆయనను అభినందించారు. గాలిపటాలు ఎత్తుకు ఎగురవేసిన వారికి బహుమతులు అందజేశారు.