ఖమ్మం, జనవరి10 (తెలంగాణ కెరటం): ఖమ్మం నగరంలో గొల్లగూడెం రోడ్డు మధురానగర్ ప్రాంతంలో వెలసిన ‘విద్యాక్షేత్ర’ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో తెలుగుతనం, తెలుగు స్రాప్రదాయం, సంస్కృతి ప్రతిబింబించే అనేక కళాకృతులను పాఠశాల నిర్వాహకులు ఆవిష్కరింపజేశారు. విద్యాక్షేత్ర పాఠశాల కరస్పాండెంట్ సౌభాగ్య, ప్రిన్సీపాల్ భారతి, డైరెక్టర్ నాగభూషణం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు నిర్వహించిన తీరు విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతో ఆకట్టుకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల చేత ముగ్గులు, గాలిపటాలు ఎగురవేయడం, విద్యార్థిని, విద్యార్థుల చేత పలు సంస్కృతిక కార్యక్రమాలు చెపట్టటంతోపాటు హరిదాసులు, కొడిపందెలు, గంగిరెద్దులు, బొమ్మల కొలువు, పొంగళ్లు, భోగి మంటలు, ఎద్దుల బండి, పల్లెదనం ఉట్టిపడేలా గ్రామీణ గుడెసెలు, గోరింటాకు, భోగిపండ్లు తదితర కార్యక్రమాలతో పాఠశాలలోనే ముందస్తు సంక్రాంతి సంబురాలు నిర్వహించడంపై పలువురు అభినందనలు ప్రకటించారు. ఈ కార్యక్రమం నిర్వహించడంపై ఖమ్మం స్టడీసర్కీల్ కళాశాల అధినేత నరసింహారావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విద్యాక్షేత్రలో సంక్రాంతి సంబురాలు
Published On: January 10, 2025 6:24 pm