సావిత్రి భాయి ఫూలే లక్ష్య సాధనకు కృషి చేయాలి

సావిత్రి భాయి ఫూలే లక్ష్య సాధనకు కృషి చేయాల

డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకయ్య

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి

సావిత్రి భాయి ఫూలే లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు, మేధావులందరూ కృషి చేయాలని మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోజున తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీబీసీఎల్ఏ) – 471/2024 ఆధ్వర్యంలో సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సావిత్రి భాయి ఫూలే చిత్రపటానికి కళాశాల సిబ్బంది పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, బడుగు,బలహీన వర్గాలకు ఉచిత విద్యను అందించాలని, వైద్య సదుపాయాలను కల్పించాలని సావిత్రిభాయి పూలే లక్ష్యంగా పెట్టుకుందని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి మహిళా ఉపాధ్యాయులతో పాటు మహిళలు, విద్యార్థులు, మేధావులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే ప్రజలలో చైతన్యం కలుగుతుందని, అందు వల్ల ఉచిత విద్య, వైద్య సదుపాయాలను కల్పిస్తేనే,ప్రజలు అన్ని రంగాలలో ముందుంటారని ఆమె ఆకాంక్షించారని ప్రిన్సిపాల్ గుర్తు చేశారు. భర్త జ్యోతిభా ఫూలే సహకారంతోనే సావిత్రి భాయి ఫూలే అన్ని రంగాలలో ముందుకు సాగిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించినందుకు ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరము మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పరీక్షల పరిశీలకులుగా విచ్చేసిన కెమిస్ట్రీ లెక్చరర్ సాగరికను ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించి, సత్కరించారు. అనంతరం రిఫ్రెష్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ చరిత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవన్న, కళాశాల అకాడమిక్ కో- ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, కామర్స్ హెచ్ఓడి ఏ.మనోజ్ కుమార్, అంజయ్య, లక్ష్మీ నారాయణ, బాబు, శ్రీనివాస్, లింగం, లక్ష్మీ, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాల అభివృద్ధికి నిధులను కేటాయించండి

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి 03 జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయాలని మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య గురువారం సాయంత్రం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు సమర్పించిన పత్రంలో విజ్ఞప్తి చేశారు. కళాశాలకు ప్రహరీ గోడ నిర్మాణం లేదని, తరగతి గదులలో సీలింగ్ లేదని, అదేవిధంగా కింద ఫ్లోరింగ్ కూడా లేదని, కిటికీలు, దర్వాజలు, వెంటిలేషన్ వంటి సౌకర్యాలు లేక విద్యార్థులు నానా పాట్లు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమం కోసం కళాశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వెంటనే 10 లక్షల రూపాయలను మంజూరు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ కు బొకేను అందజేసారు. కలెక్టరేట్ ఏఓ హన్మంతరావుకు అన్ని వివరాలు తెలుపాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎస్కెఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఐడి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరికేల అశోక్, మెట్ పల్లి చరిత్ర సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ టి.దేవన్న తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment