ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన..
తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి డిసెంబర్(18)
దూల్మిట్ట మండలంలోని కొండాపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన వారి ఇళ్ల స్థలాలను మండల జూనియర్ అసిస్టెంట్ కొండాపూర్ ఇందిరమ్మ కమిటీ ఇన్చార్జి రాజు మరియు ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన యాప్ లో దరఖాస్తుల స్వీకరణ పరిశీలించి యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది నిరుపేద కుటుంబాలకు అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మంద శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు పేరబోయిన రాజు, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ భీమగోని సాగర్ గౌడ్, వడ్లూరి వంశీ, కోడెం పద్మ నీలయ్య, ధారావత్ రాజు మరియు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షురాలు ధరావత్ బుజ్జి దీప్లా మరియు ఉమ్మడి గ్రామ మాజీ ఎంపిటిసి ఇస్లావత్ నముకు, గ్రామ మాజీ ఉపసర్పంచ్ పార్టీ నాయకులు బొల్లబోయిన రాజు, పెరబోయిన గట్టయ్య, గోలి కనకయ్య,శ్రీనివాస్ మరియు గ్రామ సిబ్బంది లింగాల చింటు మరియు ఆయా పార్టీల ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు గ్రామ ఆశావర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.