దోషుల పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి
భువనగిరి మండలం తుక్కాపురం గ్రామ సర్వే నెం. 113లో 1.20గుంటలు గల స్మశాన వాటిక ను సుమారు 100 సంవత్సరాలనుండి ఎస్ సి, బి సి లకు స్మశాన వాటిక కలదు ,ఆ స్మశాన వాటికలో అన్ని కులాలకు సంబందించిన 120 పైగా గోరిలు పెట్టినారు. ఆ స్మశాన వాటికలో ఉన్న గోరిలను బొందలను స్మశాన వాటిక కు వెళ్లే దారి ని సైతం గత రెండు రోజుల క్రితం జేసీబీ ల తో రాత్రికి రాత్రే స్మశాన వాటిక పక్కన గల పట్టాదారు కoఠం దయాకర్ మరియు ఇతని కుమారుడు దినేష్ అక్రమంగా నెల మట్టం చేసి, దారిని చెడ కొట్టినారు కావున ఎస్సీ, బిసి లకు సంబందించిన గోరిలను, బొందలను ధ్వంసం చేసి నామరూపాలు లేకుండ చేసి స్మశాన వాటిక దారిని చెడా కొట్టిన కంటం దయాకర్, కంటం దినేష్ ల పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకొని అలాగే మా గ్రామానికి సంబందించిన అదే స్మశాన వాటిక స్థలం చుట్టూ కడిలు నాటించి స్మశాన వాటిక దారికి హద్దు రాళ్లు పెట్టించాలని
*జిల్లా కలెక్టర్ కీ , భువనగిరి మండల తహసీల్దార్ కి,భువనగిరి మండల ఎంపీడీఓ గారికీ, భువనగిరి రూరల్ సీఐ లకు గ్రామ ప్రజలందరూ పాల్గొని వినతి పత్రం ఇవ్వడం జరిగింది…
ఈ కార్యక్రంలో జనగాం పాండు (టి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ),మాజీ సర్పంచ్ పుట్ట వీరేష్, నోముల మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నల్లమాస సత్యనారాయణ, రాసాల మల్లేష్, ఏడుమేకల మహేష్, జనగాం మహేష్,ముంత సతీష్,రత్నపురం శ్రీనివాస్,కొల్లోజు వెంకటాచారి,జనగాం సత్తయ్య, నల్లమాస రవి, ఏలకొండ ప్రవీణ్ రెడ్డి, భువనగిరి నగేష్, రత్నాపురం వెంకటేష్, కోలా ఉప్పలమ్మ, రాళ్లబండి నర్సింహా చారీ, ఎదునూరి వెంకయ్య, ఎదునూరి చంద్రపాల్, రత్నపురం స్వామి, గొప్పగాని బిక్షగ్జాపతి, రాచకొండ కుమార్, జనగాం అశోక్, నల్లమాస వేణు,సంపంగి నర్సింహా, జనగాం యాదయ్య, ఎదునూరి రవి, నల్లమాస చంద్రయ్య, కాసాని వెంకటేష్,రాసాల రాజు, రొండ్ల నర్సింహా, ఇంద్రవెల్లి సత్యరాజు, రాసాల శ్రీశైలం, జనగాం రమేష్ తదితరులు పాల్గొన్నారు…