దుర్వినియోగం అవుతున్న సెక్షన్ 498ఏ
తెలంగాణ కెరటం నల్కొండ జిల్లా ప్రతినిధి డిసెంబర్
ప్రస్తుతం ఉన్న న్యాయవ్యవస్థ లో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలి అని చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తాము, కానీ ఆ చట్టాలు కొంత మంది మహిళలు తెలివిగా ఉపయోగించుకొని ఎంతో మంది అమాయక మగవాళ్ళుకు యమ పశాలుగా మరుతుందిగా చెప్పవచ్చు, ఇది చాలా వరకు పట్టణ ప్రాంతం లో ఎక్కువ జరుగుతోంది అని చెప్పవచ్చు, అసలు ఏంటి ఈ సెక్షన్ ? ఎందుకు దుర్వినియోగం అవుతుంది? చూద్దాం!
సెక్షన్ 498ఏ అంటే :
ఇండియన్ పీనల్ కోడ్ 1860 ( దాని స్థానం లో కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత 2023) గా మార్చారు, ఐపిసి 498 ఏ అంటే, కుటుంబం లో వివాహిత మహిళను భర్త కానీ వాళ్ళ బందువులు అంటే అత్త,మామ, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఇబ్బందులు పెట్టిన, అది మానసికంగా కానీ, శారీరకంగా కానీ, అలాంటప్పుడు వాళ్ళు సెక్షన్ 498ఏ కింద నేరంగా పరిగణించబడతారు, ఇందులో దాదాపు మూడేళ్ళ వరకు శిక్ష విధించవచ్చు అని మనకు చట్టం వివరణ చేస్తుంది.మహిళలకు అవకాశంగా చట్టం ను ఉపయోగించుకొని కేసులు నమోదు చేయవచ్చు.
దుర్వినియోగం ఎలా?:
వాస్తవానికి భర్త వల్ల వేధింపులకు గురి కాకుండా ఉన్న కొంత చదువుకున్న మహిళలు చట్టం వాళ్లకు అనుకూలంగా ఉంది అని కొన్ని చట్టాలను తెలివిగా ఉపయోగించుకుంటున్నారు, అది గ్రామీణ స్థాయిలో అయితే చాలా తక్కువగా ఉంది అనొచ్చు, ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఏదైనా సమస్య వస్తె పెద్ద మనుషులు సాధ్యం అయినంత వరకు పరిష్కారం చేయడం జరుగుతుంది, అదే పట్టణ ప్రాంతంలో ఎక్కువగా కేసులు నమోదు అవుతాయి, మనం చూస్తే ఇటీవల కాలంలో తప్పుడు కేసు నమోదు అయ్యి అన్యాయంగా అతుల్ అనే వ్యక్తి వేధింపులు మరియు భరణం ఇవ్వలేక, ఆత్మ హత్య చేసుకున్నాడు, ఇదే విషయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది, అదేవిధంగా సుప్రీం కోర్టు కూడా ఒక కేసు దారా లక్ష్మి నారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనే కేసు తీర్పులో తప్పుడు సెక్షన్ 498ఏ మరియు వరకట్న నిషేధం చట్టం 1961 సెక్షన్ 3 మరియు 4, తప్పుడు కేసు అని, తమ వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు అని, జస్టిస్ నగారత్న మరియు కోటీశ్వర్ సింగ్ తీర్పునిచ్చారు, అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం 2020 మొత్తం సెక్షన్ 498 ఏ కింద నమోదు అయిన కేసులు 1,11,549 అయితే అందులో 5,520 కేసులు పోలీసులు పెట్టిన తప్పుడు కేసులు ఉన్నాయి,16, 151 కేసులు లా మిస్టేక్ వల్ల నమోదు అయ్యాయి, 14.4 శాతం మేర పోలీసులు మెరిట్ లేవని కోస్ చేయడం జరిగింది, 18,967 కేసులు ట్రయల్ అయితే అందులో కేవలం 14,340 వరకు కేసు నుండి బయట పడటం జరిగింది, కేవలం 3,425 వరకు మాత్రమే శిక్షలు పడ్డాయి అని చెప్పవచ్చు, అందులో 651,404 వరకు పెండింగ్ లోనే ఉన్నాయి, 96.2 పెండింగ్ శాతంగా ఉన్నది, అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి తప్పుడు కేసులు పెట్టీ వేధింపులకు గురి చేసి అధిక డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది అని చెప్పాలి, అదేవిధంగా దీనిని ఒక అస్త్రంగా ఉపయోగించుకొని కోర్టుల చుట్టూ తిప్పి ప్రయత్నం చేయడం, ఈ విధంగా కారణాలు చెప్పవచ్చు, అయితే అందరినీ అనలేం, ఈ మధ్య కాలంలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి,ఇది చట్టాన్ని దుర్వినియోగ పరచటం అవుతుంది గా భావించాలి, అయితే మనం చూడవచ్చు గతంలో కూడా చాలా కేసులు సుప్రీం కోర్టు లో 498 ఏ గా తప్పుడు కేసులు కొట్టివేయబడ్డాయి అందులో, కన్స్ రాజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, 2000, సుశీల్ కుమార్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2005, నీలు చోప్రా మరియు అదర్స్ వర్సెస్ భారతి 2009,ఇలా చాలానే ఉన్నాయి.ఎలా పోరాడాలి:అయితే ముఖ్యంగా తప్పుడు కేసులు పెట్టినప్పుడు, మీరు తప్పు చేయనప్పుడు అసలు భయపడాల్సిన అవసరం లేదు, అయితే మీరు ముందుగా ముందస్తు బెయిల్ కోర్టు లో తీసుకోవచ్చు, అదేవిధంగా మీ మిద పెట్టిన వ్యతిరేకిస్తూ మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తో కేసును హైకోర్టు లో క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని కేసు నమోదు చెపించవచ్చు, అదేవిధంగా మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసినందుకు మీరు పరువు నష్టం కూడా వేయవచ్చు, కాబట్టి తప్పుడు కేసులు ఉన్నప్పుడు ధైర్యంగా పోరాడాలి.న్యాయ సంస్కరణలు చేయాలి: నేడు ఉన్న సమాజం లో చాలా వరకు అమాయకులు బ్రతకలేని పరిస్థితి రోజు రోజుకు ఏర్పడుతుంది,ఎంతో మంది మహిళలకు న్యాయం కోసం తీసుకువచ్చిన చట్టం ను అతి తెలివి ఉపయోగించి కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారు, ఇది సహజ న్యాయ సూత్రానికి చాలా ఇబ్బందులు తేవడమే అవుతుంది అని చెప్పాలి, బాధితులు ఎంతో నష్టపోతున్నారు, ఇందులో ఎందరో అమాయకులకు శిక్షలు కూడా పడ్డాయి అని చెప్పాలి, కాబట్టి ప్రస్తుతం ఉన్న న్యాయ నిపుణులు న్యాయ వ్యవస్థ అటు పోలీస్ వ్యవస్థ కూడా కేసులు నమోదు ప్రక్రియ లో కొద్దిగా అచి తూచి అడుగులు వేయాల్సిందిగా మనవి, ఎందుకంటే అమాయకులు ఎందరో బలి అవుతున్న చట్టం అయిపోయింది, నేడు ఉన్న ఆధునిక కాలంలో మహిళకు కూడా మనవి తప్పుడు కేసులు పెట్టడం ఆపేయండి, చట్టాన్ని న్యాయ బద్దంగా వాడుకోండి. జై హింద్
– కిరణ్ ఫిషర్, అడ్వకేట్
సెల్: 7989381219