*వికారాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత*
తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (డిసెంబర్ 18)
వికారాబాద్ రైల్వే స్టేషన్లో నిర్వహించిన తనిఖీల్లో 28 కిలోల ఎండు గంజాయి పట్టుకున్నారు. లోకమాన్య తిలక్ టెర్మినల్ రైలులో ఉన్న రెండు బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ముంబైకి చెందిన జితేంద్ర మంజునాథ నాయక్, ప్రతిభ అన్నప్ప మొగ్వేరా అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విచారణలో ఆంధ్ర-ఒడిశా బోర్డర్ ప్రాంతం నుంచి కొనుగోలు చేశామని వారు ఒప్పుకున్నారు.