జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలకు కళాశాల విద్యార్థుల ఎంపిక.

జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలకు కళాశాల విద్యార్థుల ఎంపిక.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 13:

 

మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగే సీఎం కప్ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్, హిమజ్యోతి తెలిపారు. మండల స్థాయిలో జరిగిన క్రీడా పోటీలలో కళాశాలకు చెందిన బద్రు కోకో విభాగంలో, స్పందన కబడ్డీ రన్నింగ్, సప మెహిరోన్ కబడ్డీ, విభాగంలో, చరణ్ కోకో, రన్నింగ్ విభాగంలో,సాయి చరణ్ కబడ్డీ, కోకో విభాగంలో పాల్గొని మండల స్థాయిలో ప్రతిభ కనపరిచినట్లు ఆమె వివరించారు. జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు వారు ఎంపికైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాలలో వారిని అభినందించడం జరిగిందన్నారు .జిల్లా స్థాయిలో జరిగే పోటీలలో ప్రతిభా కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గూడూరు మల్లేశం, కళాశాల అధ్యాపకులు సురేందర్ రెడ్డి, ఆంజనేయులు, మస్తాన్, అశోక్ గౌడ్, బాల ప్రకాష్, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment