తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యానికి భాగంగా ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 13 ):
తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పటిన అభయ హస్త 6గ్యారెంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం ప్రజా ప్రభుత్వం శుక్రవారం నుంచి ప్రారంభించింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించుట కొరకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఆప్ రూపొందించడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామంలో ఇంటింటి సర్వే లో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా మన నల్లమల ముద్దుబిడ్డ సిఎం రేవంత్ రెడ్డి కి ,ప్రియతమ నేత స్థానిక ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశికృష్ణ కి మా గ్రామం మైలారం తరుపున ధన్యవాదలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్ సార్, గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఎల్లికంటి శ్రీనివాసులు, ఉప సర్పంచ్ బాలేశ్వరమ్మ భగవాన్ రెడ్డి, మాజీ వార్డ్ నెంబర్ నారాయణ, బి ఎల్ ఏ భాస్కర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరగదిండ్ల శ్రీశైలం ఎల్లికంటిజగదీశ్వర్,SC సెల్ అధ్యక్షులు ఉదరి శివ, వెంకటయ్య,మౌలాల్,దార మల్లయ్య,శైలజ,కర్ణ, మొదలగున వారు పాల్గొన్నారు.