---Advertisement---

సెంట్రల్ లైటింగ్ డివైడర్లపై ఎండిపోతున్న మొక్కలను స్వయంగా పరిశీలించిన 

---Advertisement---

సెంట్రల్ లైటింగ్ డివైడర్లపై ఎండిపోతున్న మొక్కలను స్వయంగా పరిశీలించిన 

 

బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 

 

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 21:

 

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో జరుగుతున్న ఒక శుభకార్యానికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండలంలోని సుంకేట్ గ్రామంలో శుభకార్యం నిర్వహించిన వారిని పలకరించి శుభాకాంక్షలు తెలిపి తిరుగు ప్రయాణంలోవిచ్చేస్తున్న నేపథ్యంలో మోర్తాడ్ పోలీస్ స్టేషన్ ముందు గల చెట్లు ఐదు చెట్లు పచ్చగా ఉండడం, మిగతా చెట్లు ఎండిపోయి ఉండడం గమనించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెంటనే వాహనంలో నుండి దిగి పచ్చగా ఉన్న చెట్లను,ఎండిపోయిన చెట్లను స్వయంగా సందర్శించి పరిశీలించారు. తమ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి, మోర్తాడ్ గ్రామంలో నుండి మోర్తాడ్ బస్టాండ్ ప్రాంతం మీదుగా మండల కార్యాలయం వరకుప్రజల,ప్రయాణికుల సౌకర్యార్థం,సెంట్రల్ లైటింగ్ డివైడర్ నిర్మాణం పనులు చేపట్టి, సుందరి కరణ గా తీర్చిదిద్ది,సెంట్రల్ లైటింగ్ డివైడర్ మధ్యప్రజల కోసం, ప్రయాణికుల కోసం, స్వచ్ఛమైన గాలిని అందించేందుకు అని గత మూడు సంవత్సరాల క్రితం చెట్లను నాటారు. అంతేకాకుండా చెట్లు ఎండిపోకుండా, డివైడర్ల మధ్య నీరు పోసేందుకు సైతం యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎండిపోతున్న చెట్ల విషయమై, మోర్తాడ్ గ్రామ మండల ప్రత్యేక అధికారి, మండల ఎంపీడీవో తిరుమల తో ఫోన్ ద్వారా బాల్కొండ ఎమ్మెల్యే మాట్లాడారు.చెట్లకు నీరు ఎందుకు పట్టడం లేదని,చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయని,మోర్తాడ్ గ్రామ ప్రత్యేక అధికారిని, మండల ఎంపీడీవో తిరుమలను ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. చెట్లకు నీరు పడుతున్నామని, ఎండిపోయిన చెట్ల కింద రాళ్లు ఉండడంవల్ల ఎండిపోయి ఉండవచ్చని ఎమ్మెల్యేతో మోర్తాడ్ గ్రామ ప్రత్యేక అధికారి మాట్లాడుతూ వివరించారు. సెంట్రల్ లైటింగ్ డివైడర్ కింద రాళ్లు ఉంటే ఒక ఐదు చెట్లు ఎందుకు పచ్చగా ఉన్నాయని, మిగతా చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయని, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండల ప్రత్యేక అధికారిని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ ముందు గల ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్ డివైడర్లపై చెట్లు ఎండిపోతున్నాయని గ్రహించిన, పాపాయి పవన్ ప్రతిరోజు చెట్లకునీరు పట్టడం వల్ల ఐదు చెట్లు పచ్చగా ఉన్నాయని, మిగతా చెట్లు ఎండిపోతున్నాయని, బాల్కొండ ఎమ్మెల్యే మోర్తాడ్ గ్రామ ప్రత్యేక అధికారిని మండల ఎంపీడీవో తిరుమలకు తెలియజేశారు. మండల ప్రత్యేక అధికారి ఎక్కడ ఉన్నారని ఎమ్మెల్యే అడిగినప్పటికీ, తాను కనీసం వేరే ప్రాంతంలో విజిట్ చేస్తున్నాననిఒక ఎమ్మెల్యే కు సమాధానం చెప్పకపోవడం,పట్ల, చుట్టుపక్కల ఉన్నవారు మోర్తాడ్ గ్రామ ప్రత్యేకఅధికారి మాట్లాడుతున్న ఆశ్చర్య సకితులయ్యారు.ఒక ఎమ్మెల్యే కే తప్పుడు సమాచారం అందిస్తున్న అధికారి,కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల,అభివృద్ధి పనుల పట్ల,ఏమరకు విధులు చిత్తశుద్ధితో నిర్వహిస్తుందో తెలియడం లేదని,అందుకే లబ్ధిదారులకు పూర్తిస్థాయి పథకాలు అందడం లేదని, అక్కడిస్థానికులు,మహిళలు పేర్కొనవడం చర్చనీఅంశంగా మారింది.దీంతో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే మోర్తాడ్ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో తో మాట్లాడుతూ వారం రోజుల తర్వాత తిరిగి వస్తానని, మళ్లీ వచ్చేసరికి, సెంట్రల్ లైటింగ్ డివైడర్లపై నాటిన చెట్లు పచ్చగా ఉండాలని,ప్రతిరోజుచెట్లకు నీరు పట్టించాలని, ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని,మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే మోర్తాడ్ గ్రామ ప్రత్యేక అధికారికి ఆదేశించారు.ఆయన వెంట ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్లెడఏలియా, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పాపాయి పవన్, మాజీ మండల వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్,ఎలాలా రాజేశ్వర్, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, మైనార్టీ నాయకులు, పలువురు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.p

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment