జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు .
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 22 . సూర్యాపేట
జిల్లా శనివారం కల్లెక్టర్ కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, సూర్యాపేట జిల్లా ఆద్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ డా. పి. రాంబాబు పాల్గొని కేక్ కట్ చేసి, కేకును ఉద్యోగులకు తినిపించి, మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగులందరికి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉద్యోగులంతా కలసి మెలసి ఉండి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను క్షత్ర స్థాయిలో సక్రమంగా ప్రజలకు అంధించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమములో టి.ఎన్.జి.వోస్ యూనియన్, సూర్యపేట జిల్లా అద్యక్ష, కార్యదర్శులు ఎస్కే.జానీమియా, దున్న శ్యామ్, ఏఒ సుదర్శన్ రేడ్డి, డి ఏమ్ ఎచ్ ఒ . కోట చలం, డి టి డబ్లు ఒ కొమ్ము శంకర్, సి. పి. వో ఎల్. కిషన్, డి ఏమ్ డబ్లు , టి జి ఒ వైస్ ప్రెసిడెంట్ జగదీష్ రెడ్డి, జిల్లా హర్టీకల్చర్ అధికారి నాగయ్య, కె. శ్రీనాద్, ఎం.సైదులు, ఏ.సతీష్, ఏ.సైదులు, బి.వెంకటయ్య, పి. శోభారాణి, నిఖిలేశ్వరి, నాల్గవ తరగతి ఉద్యోగులు, ఔట్ సోర్కింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.