అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు నర్సాగౌడ్ మృతి.
లీలా గ్రూపు చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆర్థిక సాయం.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 28:
సీనియర్ జర్నలిస్ట్ పాతూరి నర్సాగౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు. అంత్యక్రియలు అయన స్వగ్రామం నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శనివారం రోజు జరిగాయి.మెదక్ లో ప్రజాశక్తి, ఆంధ్రప్రభ విలేకరిగా అనేక సంవత్సరాలపాటు ఆయన పనిచేశారు.రామాయంపేట సాక్షి రూరల్ విలేకరిగా పనిచేశాడు. నర్సాగౌడ్ మరణం విషయం తెలుసుకొని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డీ.జి.శ్రీనివాస్ శర్మ, జర్నలిస్టుల సంక్షేమ కమిటీ సభ్యుడు కంది శ్రీనివాస్ రెడ్డి తదితరులు నస్కల్ గ్రామానికి చేరుకొని అంత్యక్రియలో పాల్గొన్నారు. అలాగే జర్నలిస్టుల ద్వారా విషయం తెలుసుకున్న లీల గ్రూప్ చైర్మన్ డాక్టర్.మోహన్ నాయక్ బాధిత కుటుంబాన్నిపరామర్శించి తన వంతు సహాయంగా 5,000 రూపాయలను ఆయన కుమారులకు అందజేశాడు.అంత్యక్రియల్లో స్థానిక ఎలక్ట్రానిక్, మీడియా అధ్యక్షుడు బల్ల యాదగిరి,టీ యూడబ్ల్యుజ్ నాయకుడు అత్తమ్మ అన్నగారి శ్రీధర్,చంద్రపు అమరేందర్ రెడ్డి,పాతూరి రమేష్ గౌడ్, వూడెం దేవరాజు,మద్దెలసత్యనారాయణ బోయిని రాజు ముదిరాజ్,కట్ట ప్రభాకర్,రాగి లింగం,రాధా కిషన్ ముదిరాజ్,చంద్రంగౌడ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాగా జర్నలిస్టు నర్సా గౌడ్ మృతి పట్లఐజెయూ సభ్యుడు బుక్క అశోక్, సోషల్ మీడియా కమిటీ సభ్యుడు మిన్పూర్ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు నాగరాజు సంతాపం తెలిపారు.