పట్టభద్రుల గొంతుకగా పనిచేస్తా.
గత పాలకులు గ్రాడ్యూయేట్స్ కు చేసిందేమిలేదు.
నిరుద్యోగుల గోడు పట్టని పాలకులు.
తెలంగాణ స్వరాజ్యం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నాచారం చంద్రశేఖర్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 1:
త్వరలో రాబోయే ఉమ్మడి మెదక్, నిజామాబాద్,కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ స్వరాజ్యం పార్టీ నుంచి పోటీచేస్తున్నట్లు పార్టీ వ్యవస్థాపకులు నాచారం చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆదివారం మెదక్ లోని ద్వారకా గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకర్లతో అయన మాట్లాడారు. మెదక్ పట్టణానికి చెందిన తాను కరోనా సమయంలో వేక్ అప్ ఆర్గనైజేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.ఓటరు నమోదు చేయని అభ్యర్థులు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.గత పాలకులు పట్టభద్రులను, నిరుద్యోగ యువతను పట్టించుకున్న పాపానపోలేదన్నారు.ఎన్నికల సమయంలో వచ్చి హడావిడి చేసి పవర్ లోకి వచ్చాక కన్నెత్తి చూడటం లేదన్నారు. మండలి లో ఏనాడూ నిరుద్యోగుల గురించి ప్రస్థావించినపాపానపోలేదన్నారు. పట్టభద్రులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకొని వారి కోసం చట్ట సభల్లో గళం విప్పే అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు.తాను ఎమ్మెల్సీ అభ్యర్థి గా బరి లో ఉంటున్నానని,వారి గొంతుకగా పనిచేస్తానన్నారు.డబ్బు సంచులతో నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు కార్పొరేట్ పెట్టుబడుదారులు వస్తున్నారని, వారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. తన వద్ద డబ్బులు లేకపోయినా పట్టభద్రుల కోసం ప్రశ్నించే తత్వం ఉందన్నారు.వారి హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత గా తనకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం లో తెలంగాణ స్వరాజ్యం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగల్ల సందీప్ కుమార్,జిల్లా నాయకులు రవి కిషోర్,ప్రభాకర్,బాలు,సాయిరాం,ప్రభాకర్ తదితరులు ఉన్నారు.