సేవలాల్ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినంగా

సేవలాల్ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినంగా

ప్రకటించాలి:భూక్య సంతోష్ నాయక్

తెలంగాణ కెరటం యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి

యాదాద్రి భువనగిరి జిల్లా లో పర్యటనలో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ సందర్శించడం జరిగింది, ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు భూక్య సంతోష్ నాయక్ *సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలనీ, అలాగే గోర్ బోలి భాషను ఎనిమిదో వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి వినతిపత్రం* ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భూక్య సంతోష్ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో లంబాడీల జనాభా 16 కోట్లు, తెలంగాణలో 47 లక్షల బంజారా లు ఉన్నారు, లంబాడి జాతికి ఉన్న ఏకైక గుర్తింపు సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్, బంజారా జాతిని ఏకం చేసి సన్మార్గంలో నడవాలని జాతీ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడిన మహా గొప్ప వ్యక్తి సేవలాల్ మహారాజ్, ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నరేష్ నాయక్ జిల్లా నాయకులు కిషన్ నాయక్, చంద్రబాను నాయక్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment