-
ఆటను స్పోర్టీవ్ గా తీసుకుని ముందుకు వెళ్ళాలి
-
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో రాజీవ్ ట్రోఫీ 17 వ క్రికెట్ టోర్నీని
-
ప్రారంభించిన ప్రముఖ డి.వై.ఎస్.ఓ. టీ.సునీల్ రెడ్డి
ఖమ్మం స్పోర్ట్స్, ఫిబ్రవరి 22 (తెలంగాణ కెరటం): నేటి యువత చదువులో రాణిస్తూనే క్రికెట్ క్రీడలో కూడా సముచిత ప్రాధాన్యతను పొందుతూ…అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం కృషి చేసినపుడే మన దేశంతో పాటు మీకు కూడా ప్రత్యేక గుర్తింపు వస్తుందని తద్వారా క్రీడలకు ప్రాధాన్యత పెడుతుందని ఖమ్మం జిల్లా యువజన క్రీడల అధికారి టీ. సునీల్ రెడ్డి అన్నారు.. శనివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రాజీవ్ మెమోరియల్ టోర్ణమెoట్ 17 వ ట్రోఫీ పేరుతో కొనసాగుతున్న సీనియర్ క్రికెట్ క్రీడాకారుల మ్యాచ్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.. ప్రస్తుత గ్రామీణ క్రీడాకారులే రేపటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చి దిద్దబడాలని ఆయన ఆకాంక్షించారు..భవిష్యత్ లో మన దేశం తరపున కూడా ఆడే విధంగా యువత కృషి చేయాలని వారు అభిలషించారు… ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము చదువుకునే రోజుల్లో నుంచి నేటి వరకు తాము కూడా క్రీడా ప్రేమికులమేనని, యువత క్రికెట్, ఇతర జాతీయ స్తాయి క్రీడలలో చురుకుగా పాల్గొంటేనే అన్ని రంగాల్లోనూ రాణించవచ్చు అని వారు ఉద్ఘాటించారు. క్రీడాస్పూర్తితో ఆడుతూ..పలువురికి ఆదర్శంగా నిలువాలని కోరారు..
తొలుత ముఖ్యఅతిథులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు మహమ్మద్ మతీన్, జర్నలిస్ట్ జానిపాషా, సీనియర్ క్రీడాకారిణి అంజలిలు, పుష్పగుచ్ఛo అందజేసి స్వాగతం పలికారు.
గెలుపొందిన విజేతలకు బాబురావు జ్ఞాపకార్ధంగా రూలింగ్ ట్రోఫీని అందజేయ బడుతుందని మతీన్ పేర్కొన్నారు.
తెలoగాణ జిల్లాల క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో జరిగే టోర్నమెంట్ కు నిర్వాహకులు మహమ్మద్ మతీన్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈమేరకు నిర్వాహకులు మతీన్ ముఖ్య అతిథులకు, వాలీబాల్ కోచ్ అక్బర్ అలి, సురేష్ ఎవరంటే స్కేటింగ్ కోచ్ సురేష్, బాస్కెట్ బాల్ కోచ్ చందు, పాల్గొనగా, డాక్టర్ ప్రవీణ్ కుమార్, బిల్డర్ చావా రాము, వి.సీద్దు, సీనియర్ క్రీడాకారిణి అంజలిలు టోర్నమెంట్ కు సహకరించారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. ఈకార్యక్రమంలో వి.సిద్దు, శోభన్, ఇబ్రహీం వెంకటేష్, సతీష్ , నరసింహారావు, ఇబ్రహీం, వెంకటేష్, యువ అoపైర్లు తదితరులు పాల్గొన్నారు.
క్రీడా పోటీల వివరాలు..
సెమీఫైనల్ మ్యాచులో ఫస్ట్ సెమీఫైనల్ ఖమ్మం అర్బన్ vs కల్లూరు జట్ల జరిగింది.
కల్లూరు జట్టు పై ఖమ్మం అర్బన్ జట్టు విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది
* రెండవ సెమీఫైనల్ మ్యాచ్ నేలకొండపల్లి vs మణుగూరు జట్ల మధ్య జరిగింది .
* మణుగూరు జట్టు పై నేలకొండపల్లి విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది.
* మొదట మ్యాచ్ ఖమ్మం జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
* బ్యాటర్లు రాజ్ కుమార్ (30),అనిల్(25),రామకృష్ణ(18) పరుగులు చేశారు.
* కల్లూరు బౌలర్లు నరసింహారావు 2,సాయిమాధవ్,అశోక్, అఖిల్,రమేష్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
* తరువాత బ్యాటింగ్ కు దిగిన తల్లాడ టీమ్ 16 ఓవర్లలో 82 పరుగులు చేసి ఓటమి పాలైనారు.
* బ్యాటర్ షానవాజ్ 30 పరుగులు చేశారు .
* ఖమ్మం అర్బన్ బౌలర్లు రామకృష్ణ 2,నవీన్ 2 , ఆశ్రాఫ్ 2 వికెట్లు తీసుకున్నారు.
* నవీన్ బెస్ట్ బౌలర్ గా నిలిచారు .
* రెండవ మ్యాచ్ లో టాస్ గెలిచిన మణుగూరు జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకొని 16 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది .
* బ్యాటర్లు సాగర్ 36,ఇమ్రాన్ 13 పరుగులు చేశారు.
* నేలకొండపల్లి బౌలర్లు వెంకటేష్ 2,శ్రీను ,తిలక్ కిషోర్,కిషోర్ తలా ఒక వికేట్ తీసుకున్నారు.
* తరువాత బ్యాటింగ్ చేసిన నేలకొండపల్లి జట్టు 12.1 ఓవర్లలో 116 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది.
* బ్యాటర్లు అశోక్ 58 , చంద్రకాంత్ 41 పరుగులు చేశారు .
* మణుగూరు బౌలర్ ఇమ్రాన్ 3 వికెట్లు తీసుకున్నారు .
* ఫైనల్ కు చేరుకున్న ఖమ్మం అర్బన్ మరియు నేలకొండపల్లి జట్లు.