న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి ఎస్ ఐ ఉమసాగర్
తెలంగాణ కెరటం నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్
జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక బృందాలతో వెల్గటూర్ మరియు ఎండపల్లి మండలాల్లో పెట్రోలింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఎస్సై ఆర్.ఉమాసాగర్ తెలిపారు 2024 డిసెంబర్ 31 ముగింపు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికే సమయంలో యువత నిర్దేశించిన సమయపాలన పాటించాలని మద్యం మత్తులో వాహనాలు నడిపిన త్రిబుల్ రైడింగ్ చేసిన టపాసులు పేల్చడం,డి జె పెట్టడం లాంటి కార్యక్రమాలు చేస్తే చట్ట రిత్యా చర్య తీసుకోవడం జరుగును. మైనర్లు బండి డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుంది.
తల్లిదండ్రులు తమ పిల్లలపై ఈ సందర్భంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుచున్నానని ఎస్ ఐ తెలిపారు వైన్ షాపులు కూడా ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి మూసివేయాలి. చదువుకునే విద్యార్థులు నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలను అతిక్రమించి ప్రవర్తిస్తే కేసులు పాలు కావడమే కాకుండా వారి భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది. వెల్గటూర్ మరియు ఎండపల్లి మండలాల ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు (2025) తెలియజేస్తున్నానని ఎస్సై ఉమా సాగర్ తెలిపారు