సొంతగూటికి యువజన కాంగ్రెస్ నాయకుడు ఉదయ్ కుమార్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 28:
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పరిధిలోని కొర్విపల్లి గ్రామానికి చెందిన యువనాయకుడు సింగమోల్ల ఉదయ్ కుమార్ శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆయన తో పాటు పలువురు గ్రామ నాయకులు కూడా పార్టీ లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా హనుమంతరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడిగా ఉన్న ఉదయ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్.రోహిత్ రావు చేస్తున్న అభివృద్ధి, కాంగ్రెస్ పథకాలు తనను తిరిగి సొంత గూటికి చేర్చాయన్నారు. రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు సూచన మేరకు గ్రామాభివృద్ధికి,పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిన్న శంకరంపేట మండల నాయకులు రాజిరెడ్డి, పుల్లారావు మరియు కొర్విపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.