‘ప్రెస్ మీడియా’ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎస్పీ అశోక్ కుమార్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి 13 : కోరుట్ల పట్టణంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సోమవారం ‘ప్రెస్ మీడియా’ దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్పెల్లి డిఎస్పి అడ్లూరు రాములు స్ధానిక సిఐ సురేష్ బాబుతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లడుతూ సమాజంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని, పాత్రికేయులు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తూ, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ‘ప్రెస్ మీడియా’ దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ‘ప్రెస్ మీడియా’ రిపోర్టర్ నజీబుల్లా తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.