నడిగూడెం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్.
– పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.
తెలంగాణ కెరటం; సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 18
సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట జిల్లా.
పోలీస్ స్టేషన్ తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ నడిగూడెం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఎస్పికి మునగాల సీఐ రామకృష్ణా రెడ్డి, స్టేషన్ సిబ్బంది స్వాగతం తెలిపినారు. ముందుగా స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, జిల్లాకు ఇటీవల వచ్చిన నూతన పోలీసు సిబ్బందిని జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు కేటాయించడం జరిగినదని అన్నారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి పోలీసు సేవలు అందించాలని సూచించారు. అనంతరం స్టేషన్ రికార్డ్స్, పరిసరాలు పరిశీలించి తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ మ్యాప్ ను, గ్రామాల హద్దులను, కేసు ఫైల్స్ ను, కోర్టు వ్యవహారాలు, రిసెప్షన్, కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు పరిశీలించారు. ఎన్ఫోర్స్మెంట్ గురించి సమీక్షించారు, రౌడి షిటర్స్, సస్పెక్ట్ పై నిఘా ఉంచాలి ఆదేశించారు. కేసులు, పిర్యాదులు పెండింగ్ ఉంచకుండా ఎప్పటికపపుడు పరిష్కరించాలి అన్నారు పోలీస్ స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి విషయమును రికార్డుల యందు నమోదు చేయాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిని మర్యాద పూర్వకముగా చూసి, వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు క్షుణ్ణంగా చేయాలి, కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలి అన్నారు. సామాజిక అంశాలు దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల నివారణ, బాలకార్మిక వ్యవస్థ, సీ సీ కెమెరాల ఏర్పాటు మొదలగు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి అన్నారు.ఎస్పి వెంట మునగాల సీఐ రామకృష్ణా రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, మండల యస్ఐ అజయ్, డిసిఆర్ బి యస్ఐ యాకూబ్, ఎస్పి సీసీ సందీప్, డిసిఆర్ బి సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి ఉన్నారు.