ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్
మెతుకు సీమ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దర్శించుకోనీ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ,మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్,నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజి రెడ్డి, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి.అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీధర్-నాగలక్ష్మిల వివాహ రిసెప్షన్‌కు హాజరై,నూతన వధూవరులనుఆశీర్వదించినారు.ఈ కార్యక్రమంలో టిపీసీసీ రాష్ట్ర నాయకుడు టిపిసిసి కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు,కొల్చారం మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, ముక్తా భాయ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.