నూతన ఎస్ఆర్ కన్వెన్షన్లో ప్రత్యేక పూజలు
తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో నర్సాపూర్ న్యూస్ (ఫిబ్రవరి 25 ):మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలోని నూతనంగా నిర్మిస్తున్న ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో ఆదివారం కన్వెన్షన్ నిర్వాహకులు కట్ట రమాదేవి సంతోష్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా స్వామి వారి కళ్యాణ ఘనంగా నిర్వహించారు. అనంతరం మండపంలో హెమం చుట్టు దంపతులు ఇద్దరు కలసి ప్రదక్షిణలు చేస్తు వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.