తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 08: ఈ నెల 09,వ తేదీ సోమవారం నుండి 15,వ తేదీ ఆదివారం వరకు కోరుట్ల పట్టణంలోని స్థానిక పద్మశాలి భవన్ లో పద్మశాలి ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ పురాణ ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవచన కార్యక్రమం బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ నిర్వహణలో సోమవారం నుండి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం 06 గంటల నుండి 7.30 నిమిషాల వరకు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. 15,వ తేదీ ఆదివారం రోజు శివకళ్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
నేటి నుండి ‘శ్రీ మార్కండేయ పురాణ ప్రవచనం’ ప్రారంభం
Published On: December 9, 2024 9:45 am
---Advertisement---