శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ డాక్టరేట్ అవార్డు పొందడం పట్ల హర్షం.. 

శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ డాక్టరేట్ అవార్డు పొందడం పట్ల హర్షం.. 

 

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,

 

 

నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ అంబాత్రేయ క్షేత్ర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరా శ్రీ స్వామీజీకి శనివారం ఆసియా ఇంటర్ నేషనల్ రీసెర్చ్ అకాడమీ ద్వారా తమిళనాడు రాష్ట్రంలోని హోసూరులో గౌరవ డాక్టరేట్ అవార్డు పొందడం పట్ల సామాజిక కార్యకర్త మహేష్ గౌడ్,ధర్మ జాగరణ సమితి జిల్లా నాయకులు డి.కృష్ణయ్య,ఆంజనేయులు గౌడ్,పి ఆర్ టి యు నాయకులు రఘువీర్ శనివారం ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.ఆదిత్య పరాశ్రీ స్వామీజీ పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతూ దేశభక్తి,దైవభక్తి పై ప్రజలను చైతన్యo చేస్తూ ఆధ్యాత్మిక భావాలు పెంపొందిస్తున్నారని వారు పేర్కొన్నారు.డాక్టర్ శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ అవార్డు పొందడం బిజ్వార్ గ్రామానికే గర్వకారణమని ఇకముందు కూడా హిందూ ధార్మిక కార్యక్రమాలను దేశ, విదేశాలలో వ్యాపింపజేసి మరిన్ని జాతీయస్థాయి అవార్డులు పొందాలని వారు ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment