శ్రీ ఉమామహేశ్వర సాగునీటి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తాం డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ .
తెలంగాణ కెరటం అచ్చంపేట (డిసెంబర్ 19):
అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండల కేంద్రంలోని శ్రీ ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టును అతి త్వరలో ప్రారంభిస్తామని డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాజెక్టును ఎవరైనా దీని ఆపాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నల్లమల్ల ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఆదేశాలకు ముఖాముఖి మీటింగ్ పెట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల రవి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తం కుమార్ రెడ్డి, మొదలగు వారితో మీటింగ్ జరిగిందని,బల్మూర్, అచ్చంపేట,అమ్రాబాద్,పదర మండలాలకు సాగునీటిని అందించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. ఎవరైనా రైతులు భూములను కోల్పోయే వారికి తగిన నష్టపరిహారం లేదా ఉపాధి కల్పిస్తామని రైతులకి భరోసా ఇచ్చారు,ఎవరైనా రైతులని రెచ్చగొట్టే టిఆర్ఎస్ టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కి హెచ్చరిక చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి,కిసాన్ అధ్యక్షులు ఖదీర్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీపతి రావు,చంద్రమౌళి, వెంకటస్వామి,మొదలగు వారు పాల్గొన్నారు.