శ్రీ వాణి విద్యాలయం పూర్వ విద్యార్థుల సమావేశం
తెలంగాణ కెరటం యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి
శ్రీ వాణి విద్యాలయం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించుటకై పూర్వ విద్యార్థులందరూ గత నాలుగు వారాలుగా కలిసి వేడుకల నిర్వహణ నిమిత్తమై చర్చలు జరిపారు.
పూర్వ అధ్యాపకులు మరియు పూర్వ పాలకమండలి సభ్యులను ఘనంగా సత్కరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
అలాగే 1974 నుండి 2024 వరకు దేశ, విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరినీ ఆహ్వానించి స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు.
ఈ పాఠశాలలో చదువుకొని ఎంతోమంది విద్యార్థులు అభ్యున్నతిని సాధించారని, వారందరినీ కలిసి తమ పూర్వ అనుభవాలను గుర్తు చేసుకునే అవకాశం ఉందని వారు అభిప్రాయ పడ్డారు.
అలాగే ఈ ఆత్మీయ సమ్మేళనం లో పలు సాంస్కృతిక అంశాలు, సరదా ఆటలు ఆడటం వంటివి ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
భారీ సంఖ్యలో హాజరైనటువంటి పూర్వ విద్యార్థులందరూ ఆ లింగనాలు చేసుకుని పరస్పరం ఒకరినొకరు పలకరించుకున్నారు..
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీ జగన్మోహన్ రెడ్డి పడమటి, డాక్టర్ గంజి రమేష్, దొంత లక్ష్మణ్,మధు, లక్కీరెడ్డి,సతీష్, నందు, శేషగిరిరావు, మంచి కంటి మనోహర్, అడ్డగట్ట వెంకటేష్, కాచం రాము, బెలి దే గణేష్, డో గి పర్తి ఓం ప్రకాష్, పొద్దుటూరి నాగేందర్, సదానందం, డాక్టర్ శ్రీవాణి, శిరీష తదితరులు పాల్గొన్నారు..