బట్టపూర్ గ్రామంలో మండల స్థాయి క్రికెట్ పోటీల ప్రారంభం 

బట్టపూర్ గ్రామంలో మండల స్థాయి క్రికెట్ పోటీల ప్రారంభం 

 

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి ఫిబ్రవరి 17 :

 

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో స్థానిక యువకులు ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీకెట్ టోర్నమెంట్ ను స్థానిక యువకుడు దయానంద్ నాయక్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ. క్రీకెట్ టోర్నమెంట్ లో పాల్గొనే జట్లు ఆధార్ కార్డు తో పాటు ఒక వెయ్యి రూపాయలు చెల్లించి అడ్మిషన్ తీసుకోవాలని, ఫైనాల్గా బహుమతి గెలిపోందిన జట్టుకు మొదటి బహుమతి గా పది వేల రూపాయల నగదు, ద్వితీయ బహుమతిగా ఐదు వేలు మరియు కప్పు అందజెస్తారని తెలిపారు.ఆసక్తి గల క్రీకెట్ క్రీడాకారులు నరేందర్ యాదవ్ 8185035654, అజీమ్ 8179523239, పవన్ గౌడ్ 7036737505, ఫోన్ నంబర్లకు సంప్రదించాలనీ తెలిపారు. ఈ కార్యాక్రమం లో ప్రవీణ్ యాదవ్, నరేందర్ యాదవ్,వర్షిత్ గౌడ్, సతీష్ గౌడ్, మారుతీ, ఆదర్శ్, సాయి, పలు గ్రామాల నుండి వచ్చిన క్రీకెట్ టీంల క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment