*రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి*
*రామాయంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో టీపిసిసి కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు*
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 24:
నేటితో 100 సంవత్సరాలు మెదక్ చర్చ్ పూర్తవుతున్న తరుణంలో చర్చికి రా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని మెదక్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించి సమావేశాన్ని భారీ ఎత్తున విజయవంతం చేసేందుకు కృషి చేయాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్. మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు మెదక్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి సమావేశాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చౌదరి సుప్రభాత్ రావు తెలిపారు. ముఖ్యమంత్రికి జిల్లా ప్రజలు ఘనంగా స్వాగతం పలకాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామం నుండి తరలిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామాయంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేశం తోపాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు.