మెదక్ బిజెపి జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల పృథ్వి ప్రదీప్ కుమార్ హాజరయ్యారు.
బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 21:
మెదక్ బీజేపీ జిల్లా కార్యాలయం లో జిల్లా అధ్యక్షుడు
గడ్డం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశానికిమ్ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ విచ్చేసి మార్గదర్శం చేసారు. వారు మాట్లాడుతూ రాబోయే ప్రతీ ఎన్నికలలో బిజెపి జెండా ఎగరవేసే దిశగా బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాము ఈ కమిటీలు బలోపేతంగా వేయడం జరుగుతుంది.ఇట్టి కార్యకర్తల కృషి వల్లనే బిజెపి విజయ డంకా మోగించబోతుందని చెప్పారు.ఇట్టి సమావేశం లో సభ్యత్వ ఇంచార్జ్ మురళీధర్ గౌడ్ , ఎన్నికల అధికారి మీసాల చెంద్రయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శిలు ఎం ఎల్ ఎన్ రెడ్డి, చిమ్మనమైన శ్రీనివాస్, రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్, బుచ్చేష్ యాదవ్,వివిధ మోర్చాల అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ,బెండవీణ, సతీష్, అసెంబ్లీ కరీంనగర్ రమణారావు,మహిళా మోర్చా కవితా రెడ్డి, సీనియర్ నాయకులు రాగి రాములు,వాల్దాస్ మల్లేష్ గౌడ్,వివిధ మండలాల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.