*మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు
తెలంగాణ కెరటం :రాయపోల్ ప్రతినిధి: డిసెంబర్ 22
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో మత్త పదార్థాలు, గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో సిద్దిపేట సిపి అనురాధ ఐపిఎస్ ఆదేశాలమేరకు ఆదివారం రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక రాయపోల్ ప్రజా సంచారం ఎక్కువగా వుండే కిరాణా షాప్స్ , బేకరీలు, టీ స్టాల్ మరియు సూపర్ మార్కెట్ నందు నార్కోటిక్ డాగ్స్ ద్వారా తనికీ చేయనైనది. ఎవ్వరు గంజాయి, మత్తుపదార్థాలు, మత్తు కలిగించే చాక్లెట్స్ అమ్మిన, కలిగి ఉన్న, రవాణాచేసిన తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలు పోలీసులకు అందజేయాలని సూచించారు. ఇట్టి తనిఖీలో ఇంచార్జ్ ఎస్సై మహిపాల్ రెడ్డి, స్థానిక ఏఎస్ఐ దేవయ్య సిబ్బంది పాల్గొన్నారు.