విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి*

*విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి*

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 17:

 

విద్యార్థులు ఉపాధ్యాయుల బోధనను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని రాగిరి రితీష్ అన్నారు. మంగళవారం చందేపల్లి ప్రాథమిక పాఠశాలకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… మా తండ్రి రాగిరి సంజీవ స్మారకార్థం ప్రైవేటు ఉపాధ్యాయురాలి నియామకం కోసం ఆర్థిక సహాయం అందించినట్లు ఆయన తెలిపారు. చదువుకు ఏవి ఆటంకం కావని, మనసుపెట్టి విద్యను అభ్యసిస్తే ఉన్నత స్థాయిలో ఉండవచ్చని అన్నారు. భవిష్యత్తులో ప్రాథమిక పాఠశాల అవసరాల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీపతి నరేందర్, ఉపాధ్యాయురాలు మడూరి విజయ, మను శ్రీ, పాఠశాల యాజమాన్య కమిటీ మాజీ చైర్మన్ బొట్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment