తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కెసిఆర్ కాలనీలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న సందర్భంగా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు తహసిల్దార్ రజనీకుమారికి ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు.15 వ బ్లాక్ లో నివాసం ఉంటున్న రంగమ్మ కుటుంబ సభ్యులు కాలనీవాసులతో తరచూ గొడవలు పడుతూ పలువురిపై దాడులు చేస్తూ అసభ్య పదజాలంతో తిడుతున్నారని తెలిపారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.