*మాలల సింహగర్జనను విజయవంతం చేయండి*
–మాల సంఘాల రాష్ట్ర నాయకుడు రాసూరి మల్లికార్జున్ పిలుపు
తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి నవంబర్ 30 :
జాతీయ మాల మహానాడు, తెలంగాణ మాల మహానాడు సంయుక్తంగా జేఎసి ఏర్పాటు చేసుకొని ఎ బి సి డి వర్గీకరణకు వ్యతిరేకంగా నేడు హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఐదు లక్షల మాలలతో మాలల సింహ గర్జన పేరిట ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రంలోని ప్రతి మాల కుటుంబం నుంచి తప్పకుండా లక్షలాదిగా తరలివచ్చి మలాల సత్తా చాటాలని, ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులతో పాటు జాతీయ మాల మహానాడు అధ్యక్షులు, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు, మేధావులు ,విద్యావేత్తలు, ఉద్యమకారులు హాజరుకానున్నారని మాల మహానాడు రాష్ట్ర నాయకుడు రాసూరి మల్లికార్జున్ పిలుపునిచ్చారు. ఎస్సి ఉప కులాల ఏ బి సి డి వర్గీకరణలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన సూచన డ్రాప్స్ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఈ దేశంలో ఏబిసిడి వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదని ఒకవేళ ఏబిసిడిలుగా వర్గీకరించిన కూడా ఎస్సిల్లోని ప్రధాన కులాలకు మాత్రమే లాభం జరుగనుందని, తద్వారా భవిష్యత్తులో ఉపకులాలకు నష్టవాటిల్లే ప్రమాదం ఉందని కనుక దేశ వ్యాప్తంగా ఎస్సీ జనాభాను ఉప కులల వారిగా లెక్కించి, రాజకీయంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటు ఉన్న అట్టడుగు కులాల నుండి జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేసి వారికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా రాజ్యాంగంలోని హక్కులు కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపుతో అలోచించి సమస్యకు పూర్తి పరిష్కారం చూపి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని అదేవిధంగా రాజ్యాంగ పరంగా దళితులకు రావలసిన వాటాను వంద శాతం అమలు చేయాలని మాల సంఘాల నాయకుడు రాసూరి మల్లికార్జున్ కోరారు.