కృషి, పట్టుదలకు మారు పేరు.. ఎస్ఆర్కే శాస్త్రి
పట్టుదల..,ఏకాగ్రత విజయానికి మూలాలు.. ఈ రెండింటిని ఆశ్రయించిన వారు ఏ రంగంలోనైనా రాణిస్తారనడానకి గొప్ప ఉదాహారణ ‘ఎస్ఆర్కే శాస్త్రి‘.. విజయానికి మారుపేరతను.. ‘శాస్తి‘ విజయాలపై ’తెలంగాణ కెరటం’ అందిస్తున్న ‘సక్సెస్ స్టోరీ’..
(తెలంగాణ కెరటం)
కృషి, పట్టుదల ఉంటే మనుషులు రుషులవుతారు.. రుషులు మహా పురుషులవుతారు అని దశాబ్దాల క్రితం వేటురి రాసిన ఓ సినిగీతం.. ఎస్ఆర్కే శాస్త్రిని చూస్తే టక్కున గుర్తుకొస్తుంది ఎవరికైనా. 1986-88వ దశకంలో శాస్త్రి తన విద్యార్థి జీవితంలో ఖమ్మం స్టడీ సర్కిల్ అధినేత నరసింహారావు అధ్వర్యంలో కామర్స్ విభాగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాన్ని కల్పించిన ఉదంతం ఇది. శాస్త్రి కామర్స్ విభాగంలో నర్సింహారావు నేత్రుత్వంలో రాటుతేలారు. ప్రతీ విషయాన్ని ప్రతి విద్యార్థికి పునర్ఛన చేసి ఎటువంటి డౌటునైనా ఏ సమయంలోనైనా తీర్చే సార్ నర్శింహారావు కావడం మూలాన తానిప్పుడు ఎంతో మందికి ఉపాధి కల్పించే స్థాయిలో శాస్త్రి అసోసియేట్ పేరుతో లీగల్, టాక్స్ కన్సెల్టేన్సీ సర్వీసెస్ సంస్థను ఏర్పాటు చేశినట్టు శాస్త్రి తెలుపుతూ.. నర్శింహారావు సార్ తో పాటు శర్మ సార్ కేవలం అకౌంట్స్ లోనే కాదు మిగతా విషయాలను తనకు బోధించారని.., ఆ ఫలితమే ఖమ్మం, హైదరాబాద్ నగరాల్లో తమ సంస్థను విస్తరింపజేసి సుమారు 60 మందికి ఉపాధి కల్పించే ప్రక్రియను 1995 సంవత్సరం నుంచి ప్రారంభించానని శాస్త్రి వివరించారు. తనకు ఏ మాత్రం కామర్స్ పట్ల లేకపోయినా ఆసక్తి ఉండేదని తాను ఇంటర్మీడియట్లో మాథ్స్ స్టూడెంట్ అయినప్పటికీ డిగ్రీలో కామర్స్ సబ్జెక్ట్ తీసుకున్నానని, నర్సింహారావు, శర్మ ఆధ్వర్యం, తన కృషి, పట్టుదల కారణంగా ఈ స్థాయికి ఎదిగినానని వివరించారు. ఎస్ఆర్కే శాస్త్రి టాక్సేషన్ అడ్వకేట్ గా విధులు నిర్వహిస్తూ లీగల్, టాక్స్ కన్సెల్టేన్సీ సర్వీసెస్ సేవలు అందజేస్తూ ఎవరైన సరే జీవితంలో కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఉదాహారణగా నిలిచారు. ఖమ్మం బ్రాహ్మణ బజార్ కు చెందిన శాస్త్రి తల్లిదండ్రులు సూర్యప్రకాశ్ శాస్త్రి, ఉదయ లక్ష్మిలకు ఐదుగురు సంతానం కాగా ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మొగపిల్లలు వారిలో తొలి సంతానంగా ఎస్ఆర్కే శాస్త్రి. శాస్త్రి తండ్రి సూర్యప్రకాశ్ శాస్త్రి ప్రభుత్వ ఉద్యోగి కాగా ప్రస్తుత కథానాయకుడు ఎస్ఆర్కే శాస్త్రికి ఇద్దరు సంతానం. ఆయన భార్య సాధారణ గ్రుహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఒక కుమారుడు, ఒక కుమార్తే కాగా కుమారుడు ఢిల్లీ జిందాల్ లో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నాడు. కుమార్తె చార్టెర్డ్ అకౌంట్ విద్యను అభ్యసిస్తోంది. తండ్రి బాటలోనే వీరు కూడా సక్సెస్ స్టోరీకి పునాదులు వేస్తున్నారు. శాస్త్రి తమ్ముడు కూడా అన్నతోపాటు ఇదే సంస్థలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ రంగంలో అచిర కాలంలోనే ఎస్ఆర్కే శాస్త్రి వేలాది మంది క్లైంట్ల మన్ననలను పొందడమే కాకుండా మరికొంతమంది తనలాంటి వారికి ఈ రంగంలో స్ఫూర్తిదాత, ఆదర్శనీయుడిగా ఎదిగినా కూడా ఒదిగి ఉండడం గమనార్హం.
ధర్మసోత్ రామకృష్ణ, జర్నలిస్ట్, ఖమ్మం. 6301332283