బాధిత కుటుంబాలను పరామర్శించిన సురభి నవీన్ కుమార్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ : కోరుట్ల పట్టణానికి చెందిన పాత్రికేయులు పెడిమల్ల రాజు, ప్రభాకర్ ల తల్లి, కోరుట్ల పట్టణం పరిధిలోని ఏకీన్పూర్ 06,వ వార్డ్ లో 126 బిజెపి బూత్ అధ్యక్షులు సంపతి మల్లేశం తండ్రి, కోరుట్ల పట్టణం హరిజన వాడకి చెందిన చంద్రగిరి జగ్గయ్య భార్య చంద్రగిరి కమల, కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన గోల్డ్ స్మిత్ తుమ్మనపెల్లి వెంకటరమణ, కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామ 121 బూత్ అధ్యక్షులు నగేష్ తల్లి ఇటీవల పలు కారణాలతో మృతి చెందగా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంగళవారం ఆయా గ్రామాలలో పర్యటించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సురభి నవీన్ కుమార్ వెంట స్ధానిక బీజేపీ, బిజేవైయం నాయకులు, కార్యకర్తలున్నారు.